గురుకుల సెక్రెటరీ అలగు వర్షిణీని సస్పెండ్ చేయాలి
వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల పట్ల బాద్యతరహితంగా గురుకులాల్లోని విద్యార్థినులను మీరేమైనా ఉన్నత కుటుంబాల నుండి వచ్చినవారా... బెల్లు కొట్టగానే మీ చేతుల్లోకి అన్నం రావడానికి అంటూ అవహేళనగా మీ మరుగుదొడ్లు కడుక్కోవాలి, మీ ఇంట్లో కొడుక్కోరా అంటూ అహంకారంగా, అవమానకరంగా మాట్లాడిన ఎస్సీ గురుకుల సెక్రెటరీ అలగు వర్షిణీ ని సస్పెండ్ చేయాలని ఎఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యూ-జార్జిరెడ్డి, పిడిఎస్యూ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఎఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన వామపక్ష విద్యార్థి సంఘాల విలేకరుల సమావేశంలో ఎఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటుకల రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జార్జిరెడ్డి పిడిఎస్యూ జిల్లా అధ్యక్షులు మందా సురేష్, పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ లు మాట్లాడుతూ... పేద, బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటూ వారి ఉన్నత చదువులకు పాటు పడాల్సిన గురుకులాల సెక్రెటరీ ఐఏఎస్ అధికారిని అలగు వర్షిణీ ఖమ్మం జిల్లా గురుకులాల సందర్శనకు వచ్చిన సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాలు గురుకులాల సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వెళితే కనీసం బాధ్యత గల అధికారిగా వినతిపత్రం తీసుకోకుండా రెండు చోట్ల కూడా తప్పించుకొని పారిపోయి అహాంకారం ప్రదర్శించారని విద్యార్ది సంఘాల నేతలు మండి పడ్డారు. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే గురుకులాల్లో చదువుకొనే దళిత, పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థినులను ఉద్దేశించి బాత్రూంలను కడుక్కోలేరా, మీరేమైనా ఉన్నత కుటుంబాల నుండి వచ్చారా... బెల్లు కొట్టగానే మీ వద్దకు అన్నం రావడానికి అని అహాంకారంగా మాట్లాడారని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు అనేక సమస్యలతో తాండవిస్తుంటే, సొంత భవనాలు లేక ఇబ్బంది పడుతుంటే అలాంటి గురుకులాలను పట్టించుకోవాల్సింది పోయి, సమస్యలను వినకుండా, ఒక ఐఏఎస్ అధికారిగా బాధ్యతగా రహితంగా విద్యార్థి సంఘాల పట్ల అహంకారం ప్రదర్శించడాన్నీ వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించారు. గురుకులాల్లో గత 15 సంవత్సరాలుగా నిస్వార్థంగా అతి తక్కువ జీతాలతో పని చేస్తున్న గురుకుల కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ఎసిటీ సిబ్బందిని వారి పనిని పరిశీలించి జీతాలు పెంచాల్సింది పోయి నిర్దాక్షిణ్యంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వారిని తొలగించడం దారుణమన్నారు. గురుకుల విద్యార్థులు ఉన్నతి కోసం పనిచేసిన వారి కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి గురుకులాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, విద్యార్థినులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య సగానికి సగం పడిపోయిందని దానికి కారణం గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి అని విమర్శించారు. గురుకుల విద్యార్థుల ఉన్నత, మెరుగైన చదువుల కోసం పాటుపడాల్సిన సెక్రటరీ వాటిని నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. సెక్రెటరీ చేస్తున్న అహంకార పనులకు వ్యతిరేకంగా గురువారం జిల్లా, నియోజకవర్గాల కేంద్రాల్లో గురుకుల సెక్రెటరీ అలగు వర్షిణీ దిష్టిబొమ్మ దగ్ధం ఉంటుంది అని, ఆమెను
సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనివెడల పెద్ద ఎత్తున ఆందోళనకు వెనకాడబొమనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సుధాకర్, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు త్రినాధు, మనోజు, అజయ్, లోకేష్, మనోజు, వెంకటేష్, జంపన్న వరుణ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు


Comments