హవీలా' పద్యం అచ్చతెలుగులో జాషువా పద్యాన్ని పోలి ఉంటుంది
విసి ఆచార్య వెలుదండ నిత్యానందరావు
'హవీలా' కు తెలుగు విశ్వవిద్యాలయ కీర్తిపురస్కారం
ఖమ్మం బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 23 , తెలంగాణ ముచ్చట్లు:
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారు 2024 విద్యాసంవత్సరానికి గాను ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత పాలపర్తి హవీలాకు పద్యరచన విభాగంలో కీర్తి పురస్కారానికి ఎంపికచేశారు. ఈ పురస్కారాన్ని హైదరాబాద్ లో మంగళవారం జరిగిన కీర్తి పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ డాక్టర్ కె.వి వరప్రసాదరెడ్డి, విసి ఆచార్య వెలుదండ నిత్యానందరావు, గణపతిరెడ్డి ఎండి తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల కార్పొరేషన్ వారి చేతులమీదుగా హవీలా అందుకున్నారు. ఈ సందర్భంగా విసి నిత్యానందరావు మాట్లాడుతూ.... హవీలా పద్యం అచ్చతెలుగులో జాషువా పద్యాన్ని పోలి ఉంటుందని అంతేకాకుండా పోతన శైలి ఆమె పద్యాలలో ఉట్టిపడుతుందని తెలిపారు. ఇలా మరిన్ని కవితా రచనలు చేసి మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. హవీలాకు గతంలో మండలి ఫౌండేషన్ వారు ఆమె రచించిన ఆంధ్రయశోభూషణం ఖండకావ్య సంపుటికి రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి పోటీలలో మొదటి బహుమతి అందుకోవడం అభినందనీయం. గుంటూరు సాహితీ సమాఖ్య 2017 లో 'ఉగాది పురస్కారం' అందజేసి సత్కరించింది. ఇవే కాకుండా రావి రంగారావు పురస్కారం, ప్రసన్న భారతి పురస్కారం హవీలా అందుకున్నారని తెలియజేశారు.


Comments