పోరుబాట మరువని యువనేత
తండ్రి నడిచిన బాటలోనే తన పయనం
సిసిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యునిగా ఎన్నికైన గ్యానం వాసు
తెలంగాణ ముచ్చట్లు (నూగురు) వెంకటాపురం ములుగు జిల్లా
పి1996 సంవత్సరంలో విద్యార్థిగా ఎస్ఎఫ్ఐ జెండా పట్టి పోరుబాటలో అడుగుపెట్టిన గ్యానం వాసు నేడు సిపిఎం పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా, వెంకటాపురం మండల కార్యదర్శిగా బాధ్యతల్లోకి వచ్చాడు,ఉమ్మడి భద్రాచలం డివిజన్ నాయకుడిగా వెంకటాపురం మండలం సీపీఎం పార్టీ అభివృద్ధి కి జీవితాంతం కృషి చేసిన అమరజీవి గ్యానం. సారయ్య కుమారుడు గ్యానం వాసు
ఒకనాడు వారి ఇల్లు పార్టీ నాయకులు ప్రజల రాకపోకలతో కలకలలాడేది ఇంటికి వచ్చే పార్టీ నాయకులు ప్రజలతో ఆ ఇంట్లో నిత్యం పోరాటాలు ఆందోళనలు ప్రజా సమస్యలపై చర్చలు సాగుతుండేవి అలాంటి సమయంలో విద్యార్థిగా ఉన్న వాసు పై సిపిఎం పార్టీ ప్రభావం, పోరాటాల ముద్ర గట్టిగానే పడింది
విద్యార్థుల సమస్యలపై పోరాడే ఎస్ఎఫ్ఐ నాయకుల సైతం సారయ్య ఇంటికి వచ్చి పోయేవారు ఆ సందర్భంలోనే వాసుకి ఎస్ఎఫ్ఐ నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి ఆ పరిచయాలు వాసుని ఎస్ఎఫ్ఐ సంఘానికి వెంకటాపురం మండల నాయకుడిని చేసి అనేక పోరాటాలకు విద్యార్థి పోరాటాలకు నాయకత్వం వహించేలా చేసింది పుస్తకాల సమస్య, టీచర్ల కొరత, హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం వెంకటాపురం వాజేడు
మండలాలలో జరిగిన విద్యార్థి ఉద్యమాలకు వాసు నాయకత్వం వహించాడు ఆనాడు ఎస్ఎఫ్ఐ భద్రాచలం డివిజన్ నాయకత్వంతో సమన్వయంతో పని చేశారు అలా ఎస్ఎఫ్ఐ భద్రాచలం డివిజన కమిటీ సభ్యునిగా 1997, 1998లో ఎన్నికయ్యాడు విద్యార్థి ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న వాసుకి 2000 సంవత్సరంలో సిపిఎం లో సభ్యత్వం లభించింది
ఆనాటి నుండి సిపిఎం పార్టీ రాజకీయ విధానానికి కట్టుబడి ఎర్ర జెండా పోరాటాలను విజయవంతం చేయడంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు
వెంకటాపురం మండలంలో యాకన్న గూడెం నుండి బర్లగూడెం వరకు మండలంలోని ప్రతి ఊరిలో అందరికీ తెలిసిన నేతగా ప్రజల మనిషిగా పనిచేసిన అమరజీవి గ్యానం సారయ్య వారసత్వాన్ని కొనసాగిస్తూ పోరుబాటలో ముందుకు సాగుతున్నాడు
వాజేడు మండలంలో2003 సంవత్సరంలో ప్రజాశక్తి దినపత్రిక విలేఖరిగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై పలు వార్తలు రాశారు పోరాటాలకు అండగా నిలిచారు 2006వ సంవత్సరంలో సిపిఎం వెంకటాపురం మండల కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యాడు అమరజీవి గుర్రం వెంకటేశ్వర్లు నాయకత్వంలో మండలంలో జరిగిన వ్యవసాయ కూలీ పోరాటాలు జయప్రదం చేయడంలో ముఖ్య భూమిక పోషించాడు 2007 స్థానిక సంస్థల ఎన్నికల్లో వెంకటాపురం మేజర్ గ్రామపంచాయతీలో సిపిఎం పార్టీ తరఫున వార్డు మెంబర్ గా ఎన్నికై ఐదు సంవత్సరాల పాటు పంచాయతీ ఉప సర్పంచ్ గా 11 నెలల పాటు సర్పంచ్ గా పనిచేసే మేజర్ పంచాయతీలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు 2013లో డివైఎఫ్ఐ మండల నాయకుడిగా పని చేశారు ఆ తర్వాత వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శిగా పనిచేశారు ఆ సమయంలో కూలి రేట్ల పెంపు ఉద్యమం, పోడు భూముల సమస్య, ఇంటి స్థలాల ఉద్యమాలకు నాయకత్వం వహించాడు
32 గ్రామాలలో 11 రోజులపాటు కూలీల చేత సమ్మె చేయించాడు ఆ సమయంలో ధనిక రైతులు, ఆనాటి అధికార పార్టీ నాయకుల బెదిరింపులను లెక్కచేయకుండా సమ్మెకు నాయకత్వం వహించి రోజుకి 150 రూపాయలు కూలి పెంచడం జరిగింది 2014 సంవత్సరంలో సిపిఎం భద్రాచలం డివిజన్ మహాసభలు వెంకటాపురంలో జరిగాయి ఈ సందర్భంగా జరిగిన భారీ ప్రదర్శన, బహిరంగ సభను విజయవంతం చేయడంలో వాసు క్రియాశీలక పాత్ర నిర్వహించాడు 2014 సంవత్సరంలో సిపిఎం భద్రాచలం డివిజన్ కమిటీ సభ్యుడుగా ఎన్నికై డివిజన్ కమిటీలు రద్దు అయ్యే వరకు ఆ బాధ్యతలలో కొనసాగారు జిల్లాల విభజన నేపథ్యంలో వెంకటాపురం మండలం మొదట భూపాలపల్లి జిల్లాలో ఆ తరువాత ములుగు జిల్లాలో కలవడంతో ప్రస్తుతం ములుగు జిల్లా సిపిఎం పార్టీలో కార్యదర్శి వర్గ సభ్యుడిగా పనిచేస్తున్నారు భూపాలపల్లి జిల్లా మహాసభలు 2016లో వెంకటాపురంలో విజయవంతంగా నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషించాడు
2022 సంవత్సరంలో వ్యవసాయ కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై 31 గ్రామాలలో 19 రోజులపాటు కూలిపోరాటం సమ్మె చేయించి 200 రూపాయలు ఉన్న కూలీని 300 రూపాయల వరకు కూలీ రేట్లు పెంచడంలో కీలకంగా వ్యవహరించాడు నాగారంలో వారం రోజులపాటు కూలీల చేత సమ్మె చేయించి 180 రూపాయలు ఉన్న కూలిని 250 రూపాయల వరకు పెంచడంలో ముఖ్యపాత్ర పోషించాడు కార్మిక వర్గ పక్షపాతిగా వ్యవసాయ కూలీలు, పేద రైతులు, వివిధ రంగాల కార్మిక ఉద్యమాలకు వెన్ను దన్నుగా నిలిచాడు
2004 సంవత్సరంలో సున్నం రాజయ్య ఎమ్మెల్యే డాక్టర్ మీడియా బాబురావు ఎంపీగా గెలిపించడంలోను 2009, 2014, 2019,2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పని చేశాడు
నమ్మిన సిపిఎం సిద్ధాంతం కోసం తండ్రి నడిచిన పోరుబాటలో కొనసాగుతున్న వాసుకి విద్యార్థి దశ నుండి నేటి వరకు పోరాటాలలో తాను నిర్వహించిన పాత్రను గుర్తించిన సిపిఎం పార్టీ ప్రజా పోరాటాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శిగా, ములుగు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యునిగా బాధ్యతలు అప్పగించింది భద్రాచలం డివిజన్ అమరవీరుల స్ఫూర్తితో పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని వాసు చెప్తున్నాడు యువనేత సారధ్యంలో ఉద్యమాలు ఉదృతంగా సాగాలని ఆశిద్దాం


Comments