హెచ్ఎంటి చెరువు కట్ట వాకింగ్ ట్రాక్ పునరుద్ధరణ 

స్థానిక వాకర్లకు ఊరటనిచ్చే చర్య కార్పొరేటర్ శాంత సాయిజన్ శేఖర్

హెచ్ఎంటి చెరువు కట్ట వాకింగ్ ట్రాక్ పునరుద్ధరణ 

నాచారం, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ నాచారం డివిజన్ లో హెచ్ఎంటి నగర్ చెరువు కట్ట నుండి హైకోర్టు కాలనీ వరకు విస్తరించి ఉన్న వాకింగ్ ట్రాక్‌లో గుంతలు, మట్టి రోడ్డు సమస్యల కారణంగా ప్రతిరోజూ వాకింగ్ చేసుకునే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో మరింతగా ఈ మార్గం దారుణ పరిస్థితికి చేరడంతో వాకర్లకు అసౌకర్యం కలుగుతున్న విషయం స్థానికులు పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలో, సుమారు రూ.17 లక్షల వ్యయంతో వాకింగ్ ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టబడ్డాయి. ట్రాక్‌లో ఏర్పడిన గుంతలను పూడ్చి, కొత్త మట్టిని వేసి, రోడ్డును చదును చేసే పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. దీనివల్ల వాకర్లకు సురక్షితంగా, సౌకర్యవంతంగా నడిచే వాతావరణం కలగనుంది.
బుధవారం రోజు ఈ పనులను నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ –“ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాకింగ్ ట్రాక్‌ను ఆధునికంగా తీర్చిదిద్దుతున్నాము. స్థానికుల నుండి వచ్చిన అభ్యర్థనల ఆధారంగా జిహెచ్ఎంసి నిధులతో రూ.17 లక్షల వ్యయం చేసి ఈ పనులు చేపట్టాం. త్వరలో వాకర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన వాకింగ్ ట్రాక్ అందుబాటులోకి రానుంది” అని పేర్కొన్నారు.అంతే కాకుండా ఆయన భవిష్యత్తు లో వాకింగ్ ట్రాక్ చుట్టూ లైటింగ్ సదుపాయాలు, చెట్ల పెంపకం, పార్క్ అభివృద్ధి వంటి పనులు కూడా దశలవారీగా చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎంటి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు యాదగిరి రెడ్డి, నర్సింగ్ రావు, కిరణ్, మక్బూల్, రామరాజు, సాయిజెన్ శేఖర్, కట్ట బుచ్చన్న, గౌడ్, విటల్ యాదవ్, భూపాల్ రెడ్డి, దాసరి కర్ణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు ఈ పనులు ప్రారంభమైనందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .