ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ ఇండ్లు, రేషన్ కార్డులు
ఒకే రోజు 22968 రేషన్ కార్డుల పంపిణీ
వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి నియోజకవర్గ పరిధిలోని ఖిల్లా ఘనపురం, పెద్దమందడి, వనపర్తి మున్సిపాలిటీ, వనపర్తి మండలాలకు సంబంధించి బుధవారం 22968 రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో, 3489 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
అదేవిధంగా పెద్దమందడి మండల కేంద్రంలోని శ్రీ చెన్నకేశవ స్వామి (పుల్లన్న యాదవ్) ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, 4843 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ...
గత 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో, ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు మంజూరు చేసిన పాపాన పోలేదని ఎమ్మెల్యే విమర్శించారు.నేటి ఇందిరమ్మ రాజ్యంలో గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల పంపిణీతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు.
గ్రామ గ్రామాన వందల వేల సంఖ్యలో కొత్త రేషన్ కార్డులు మంజూరు అవ్వడంతో నిరుపేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.ప్రభుత్వం నేడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం, రేషన్ కార్డుల పంపిణీతో నిరుపేదలు గ్రామాలలో ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకువచ్చిన సాగునీటి కాలువలకు, బొక్కలు పెట్టి తామే నీరు తెచ్చామని, పేర్లు మార్చుకొని తిరిగినంత మాత్రాన అది సార్ధకం అయిపోదని ఎమ్మెల్యే దూషించారు.కాంగ్రెస్ సర్కార్ పాలనపై, సీఎం రేవంత్ రెడ్డి గారి పై అనునిత్యం విమర్శలు చేసే కేటీర్ కు ఎమ్మెల్యే నేరుగా సవాల్ విసిరారు. ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, ఎమ్మెల్యే పేర్కొన్నారు,
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా పౌర శాఖ అధికారులు విశ్వనాథ్, వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టి.సాయిచరణ్ రెడ్డీ, ఘనపూర్ సింగిల్ విండో అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, క్యామరాజు, వెంకట్రావు, మండల ఆధ్యక్షుడు విజయ్ కుమార్, రమేష్, ఆగారం ప్రకాష్, పెద్దమందడి మండలానికి చెందిన వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు కె.రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, టి. రఘుప్రసాద్, మాజీ జడ్పీటీసీ కె.వెంకటస్వామి, శంకర్ నాయక్, తహసీల్దార్ ఎన్.సరస్వతి, డిఎస్. మహేష్, సుదర్శన్ రెడ్డి, గట్టు యాదవ్, టైలర్ రవి, రాఘవేంద్ర, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments