రిపోర్టర్లపై అక్రమ కేసులు సరికావు

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కందుకూరి సంజీవ్

హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు:

 కవరేజీ కోసం వెళ్లిన రిపోర్టర్లపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కందుకూరి సంజీవ్ అన్నారు. మండలంలోని ఎర్రగట్టుగుట్ట క్రాసు రోడ్డులోని తెలంగాణ బాలికల గురుకుల కళాశాల హసన్ పర్తిలో ఇటీవల జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల వివాదంలో కవరేజికి వెళ్లిన ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్ దాడి భిక్షపతిని టార్గెట్ చేస్తూ కళాశాల ప్రిన్సిపల్ ఇందుమతి కక్ష్యపూరితంగా మొదటి నిందితుడిగా హసన్ పర్తి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసులు కూడా అక్కడ జరిగిన ఘటనపై విచారించి కవరేజీలో కెమెరామెన్ పాత్ర ఏంటని దర్యాప్తు చేయకుండా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు అంశాలలో సత్యాసత్యాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇలా కేసులు నమోదు చేయడంపై పునరాలోచన చేసి కెమెరామెన్ పై పెట్టిన కేసును ఎత్తివేయాలని స్థానిక పోలీసు ఇన్ స్పెక్టర్ ను కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్ స్పెక్టర్ వట్టే చేరాలును కలిసిన వారిలో ఈసీ మెంబర్ కందుకూరి సంజీవ్ తో పాటు బాధితుడు దాడి భిక్షపతి, మీడియా ప్రతినిధులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .