హనుమకొండలో యూనిఫామ్ డైట్ ప్రారంభోత్సవం
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూనిఫామ్ డైట్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ టీవీ టవర్ ఎస్సీ జూనియర్ కాలేజీ హాస్టల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎంహెచ్ఓ డాక్టర్ ఏ. అప్పయ్య చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆయనతో పాటు ఎలుకతుర్తి ఎంపీడీవో విజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ, ప్రభుత్వం పిల్లల సంక్షేమం కోసం డైట్ చార్జీలను 40% పెంచిందని, దీనివల్ల విద్యార్థులు సమతుల్య ఆహారం తీసుకుని మాల్‌న్యూట్రిషన్ మరియు రక్తహీనత సమస్యల నుంచి దూరంగా ఉంటారని అన్నారు. విద్య అనేది దొంగలించబడనిది కాబట్టి, విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత పౌరులుగా మారాలని సూచించారు.
విద్యార్థులతో ప్రత్యేక భోజనం:
డీఎంహెచ్ఓ విద్యార్థులతో కలిసి భోజనం చేసి వంటశాలను పరిశీలించారు. వంటకారులకు ఆహార నియమాలు బోధించగా, విద్యార్థులకు అవుట్‌డోర్ గేమ్స్‌కు సరిపడిన ప్లే గ్రౌండ్ లేకపోవడం గమనించిన డీఎంహెచ్ఓ, క్యారమ్ బోర్డ్ మరియు చెస్ బోర్డును బహూకరించారు.
ముగ్గురు విద్యార్థులతో చర్చ:
డీఎంహెచ్ఓ, ఆదిత్య (ఐటీఐ), సాయి కిరణ్ (ఎంబీఏ)తో కూడా మాట్లాడారు. వారి విద్యపై శ్రద్ధపెట్టేలా ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆఫీసర్ రవికుమార్, వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, స్థానిక అధికారులు పాల్గొన్నారు.


Comments