సర్వజ్ఞ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సర్వజ్ఞ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు:

78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక వీడియోస్ కాలనీలోని సర్వజ్ఞ పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కె. నీలిమ జాతీయ జెండాను ఆవిష్కరణ గావించారు. తదనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో ఆగస్టు 15న త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుందని. 200 ఏళ్ల బ్రిటిష్ ప్రభుత్వ పాలన నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు సుదీర్ఘ పోరాటం సాగించారని. దీని ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించిందని తెలుపుతూ మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేశారు. మనం భారత దేశంలో పుట్టడమే ఎంతో గర్వించదగ్గ విషయమని ఇటువంటి పుణ్యభూమిలో పుట్టిన మనం ఎంతో నిబద్ధతతో, పట్టుదలతో చదువులో రాణించాలని విద్యార్థులను కోరారు. భారత దేశ స్వాతంత్ర సముపార్జన కోసం స్వేచ్ఛాయుత పాలన కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను ఆమె ఈ సందర్భంగా కొనియాడారు. ఈ సందర్భంగా చిన్నారులకు డ్రాయింగ్, ఎలక్యూషన్, ఎస్పై వైటింగ్స్ పోటీలు. నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. డైరెక్టర్స్ ఆర్.వి. నాగేంద్ర కుమార్, నీలిమ చిన్నారులకు మరియు అధ్యాపక బృందానికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. పలువురు చిన్నారులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల వేషధారణలో అలరించారు. తేనెల తేటల, ఇండియా వాలా, దేశం మనదే, ఎగురుతున్న జెండా, జై హిందుస్థాని, అంటూ సాగిన నృత్యాలు విద్యార్ధులను అలరించింది. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. ఈ వేడుకలలో ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .