వెల్టూర్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతూ.. మహానుభావుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, మహానుభావులు చేసిన సేవలు, త్యాగాలు మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆశా వర్కర్లు, మహిళా సమాఖ్య సభ్యులు, గ్రామస్తులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో, గ్రామ మాజీ సర్పంచ్ ఆర్.శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్,ప్రధానోపాధ్యాయులుబాణం విష్ణు,రఘువరన్ రెడ్డి, గుడిబండ శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున్, వడ్డె శేఖర్, రవీందర్, శివానంద, పట్నం సత్యన్న, కావలి రాజు,చిట్టి అశోక్, సాకలి రమేష్, ఆంజనేయులు ,కేశవసాగర్, గ్రామ పెద్దలు, ఆశా వర్కర్లు, మహిళా సమాఖ్య సభ్యులు, గ్రామస్తులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments