ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగవంతం చేయాలి
-ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ సత్యా శారదా దేవి
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండ ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ సత్యా శారదా దేవి, ఇందిరమ్మ ఇండ్ల సర్వేను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సర్వేయర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని వడ్డేపల్లి కాలనీలో సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన ఆమె, ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు.
64 వేల దరఖాస్తులపై సర్వే
గ్రేటర్ వరంగల్‌లో మొత్తం 64 వేల దరఖాస్తుల సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 4000 మాత్రమే పూర్తి అయ్యాయని కలెక్టర్ తెలిపారు. సర్వేలో వేగం పెంచి, ప్రతి డివిజన్‌లో 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ నియమించి 31 డిసెంబర్ లోగా పూర్తి చేయాలని ఆమె సూచించారు. సర్వేలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని, దరఖాస్తుదారుల పేర్లు మిస్ అయితే మళ్లీ దరఖాస్తులను స్వీకరించి పరిశీలించాలని ఆమె స్పష్టం చేశారు.

అధికారులు, సిబ్బందికి సూచనలు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు ఆఫీసర్ హరినాథ్, హౌసింగ్ డీఈ సిద్ధార్థ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Comments