నాగారం మున్సిపాలిటీలో సమాచార హక్కు వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహణ

నాగారం మున్సిపాలిటీలో సమాచార హక్కు వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహణ

నాగారం, అక్టోబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):

నాగారం మున్సిపాలిటీ పరిధిలోని మారుతి గార్డెన్‌ ప్రాంగణంలో సోమవారం రోజున సమాచార హక్కు చట్టం వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ – “సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి బలాన్నిచ్చే శక్తివంతమైన సాధనం. ప్రభుత్వ పనితీరు, పాలనా వ్యవస్థపై ప్రజలకు పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తోంది. పారదర్శక పాలన సాధనలో ప్రతి పౌరుడు ఈ హక్కును వినియోగించుకోవాలి,” అని పేర్కొన్నారు.కార్యక్రమంలో అధికారుల మధ్య చర్చా వేదికను ఏర్పాటు చేసి, ప్రజల్లో సమాచార హక్కుపై చైతన్యాన్ని పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పౌరులతో ప్రత్యక్ష చర్చల ద్వారా సందేహాలను నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నారాయణ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, రెవెన్యూ ఆఫీసర్ బి. నాగేశ్వర రావు, బి. సురేష్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయి రాజ్, సానిటరీ ఇన్స్పెక్టర్ ఎ. బాబు, ఎంవిరాన్మెంటల్ ఇంజనీర్ బి. శ్రవణ్ కుమార్, సి.సి.ఆర్. నిఖిలేశ్వర్, అన్ని వార్డుల వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.కార్యక్రమం ముగింపు సందర్భంగా సమాచార హక్కు చట్టంపై పాంఫ్లెట్లు పంపిణీ చేయడంతో పాటు హెల్ప్‌లైన్ నంబర్లు, అప్లికేషన్ ప్రక్రియలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా ముగిసిందని కమిషనర్ తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .