వైద్య ఆరోగ్యశాఖలో డాక్టర్ల నీయమాకం కొరకు దరఖాస్తుల ఆహ్వానం
భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు: వైద్య మరియు ఆరోగ్య విభాగం జాతీయ ఆరోగ్య మిషన్ నందు ఆళ్లపల్లి మరియు దమ్మపేట మాతా శిశు ఆరోగ్య,ఎపిడమిక్ బృందంలో వైద్యాధికారి ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్హతలు ఎంబిబిఎస్ పట్టభద్రులై,మెడికల్ కౌన్సిల్ లో నమోదు చేసుకొని ఉండాలని, అభ్యర్థి వయస్సు 31 జూలై 2024 నాటికి 44 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఏజెన్సీ ఏరియా గిరిజన అభ్యర్థులకు మరియు గతంలో గిరిజన ప్రాంతంలో పనిచేసిన అనుభవం గల వారికి నియామకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వబడునని, నియామకం ఒక సంవత్సరం కాంట్రాక్టు పద్ధతి పై తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వైద్యాధికారి నెలసరి వేతనం 52,000 వరకు ఉంటుందని 23 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలలోపు వరకు వయసు ఉండాలని, చర్ల,ఆళ్లపల్లి మండలాల్లో పనిచేయవలసి ఉంటుందని అన్నారు.కావున ఆసక్తి గల అభ్యర్థులు తమ జిరాక్స్ సర్టిఫికెట్ తో జతపరిచిన దరఖాస్తులను ఈ నెల 20 నుండి 27 సాయంత్రం 5 గంటలలోపు ఐటీడీఏ భద్రాచలం ప్రాంగణంలో గల అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అందజేయవలసినదిగా ఆయన తెలియజేశారు.గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు అంగీకరించబడవని ఆయన అన్నారు.


Comments