బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహమా ?

తెలంగాణ ఆడబిడ్డలను అవమానించినట్టే 

బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహమా ?

టిఆర్ఎస్ యువ నాయకుడు పోలిశెట్టి ప్రతాప్

వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:

 బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి ఏర్పాటు చేయడం తెలంగాణ ఆడబిడ్డలను అవమానించే విధంగా ఉందని బిఆర్ఎస్ యువ నాయకుడు మళ్లీ దశ తెలంగాణ ఉద్యమకారుడు పోలిశెట్టి ప్రతాప్ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. పోలిశెట్టి ప్రతాప్ మాట్లాడుతూ.. పోరాటంలో గమ్యాన్ని ముద్దాడడం  ఎంత ముఖ్యమో ముద్దాడిన గమ్యాన్ని పది తరాలకు అందేలా కాపాడడం అంతే ముఖ్యం. పోరాటంలో ఓడిన శత్రువు ఎప్పుడు మనం అందుకున్న గమ్యాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తూనే ఉంటాడు. మన వేలుతో మన కన్ను పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.మనోడికి కత్తి ఇచ్చి మనల్ని చంపే కుట్ర చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తెలంగాణ తల్లి మార్పు కూడా అలాంటిదే అవమానాలు, అవహేళనలు,అణచివేతలు అన్నిటిని తట్టుకుని నిలబడ్డ తెలంగాణ ను ఓర్చుకోలేక,మనలో భాగంగా మనలో ఒకరిగా ఉంటూ సమైఖ్య శక్తులు చేసే కుట్రనే ఇవ్వాళ తెలంగాణ అస్థిత్వాన్ని కనుమరుగు చేసే చర్యలు తెలంగాణ బతుకులో భాగమైన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి తొలగించడం దేనికి ప్రామాణికం కిరీటాలు వజ్ర వైడూర్యాలతో ఉన్న తెలుగుతల్లి తల్లి అయినప్పుడు కిరీటాలు, నగలతో ఉండే తెలంగాణ తల్లి తల్లి కాదా ?ఆంద్రబాబుల శిష్యుడిగా రేవంత్ రెడ్డి చేస్తున్న వికృత క్రీడను ఆహా ఓహో అంటూ కీర్తిస్తున్న ఆంధ్ర విష పత్రికలు ఏం చెబుతున్నాయి ?పిచ్చోళ్ళరా మీరు సాధించుకున్నది రాష్ట్రాన్ని మాత్రమే అడుగడుగునా మా ఆధిపత్య జాడలు మీ వెన్నంటే ఉన్నాయి చెప్పకనే చెబుతున్నాయి.జాగో తెలంగాణ భవిష్యత్తు తరాలకు మన చరిత్ర మనం చెప్పుకోకపోతే మన పుట్టుక కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయే అవకాశం ఉంది.రాష్ట్ర సాధన కోసం ఆనాడు రోడ్డెక్కిన ప్రతి బిడ్డ మన అస్తిత్వం కోసం గొంతు విప్పాల్సిన అవసరం ఉంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .