గాడ్సేల పాలనలో... గాంధేయ మార్గం సాధ్యమా!

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి. 

గాడ్సేల పాలనలో... గాంధేయ మార్గం సాధ్యమా!

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

గాడ్సేల పాలనలో గాందేయ మార్గం అనుసరించడం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి అన్నారు. శనివారం చింతకాని మండలం బస్వాపురంలో రైతు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన మాట తప్పాయని అన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలు రద్దు చేస్తామని చెప్పి నేటికీ రద్దు చేయలేదు అన్నారు. ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లో నిరసన తెలియజేస్తున్న రైతులను అడ్డుకుంటున్నారని హంగర్ స్ట్రైక్ చేస్తున్న రైతు నాయకుడు జగ్ జిత్ సింగ్ దల్లే వాల్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్నారు దీనిపై అత్యున్నత న్యాయస్థానం రైతులు గాంధేయ మార్గంలో ఆందోళన నిర్వహించమని చెప్పడం ప్రస్తుత గాడ్సే వారసుల పాలనలో సాధ్యమా అన్నారు.  వ్యవసాయ సాగువ్యయం పెరగడంతో రైతులు నష్టాలపాలయ్యారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా రైతులందరికీ రుణమాఫీ చేయాలని, తక్షణమే రైతు భరోసా అందించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అమలుకు పొంతన లేదన్నారు. నాగిలిగొండలో జరిగిన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వేపూరి రవీంద్రబాబు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వందనంలో జరిగిన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కోశాధికారి కూచిపూడి రవి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు మార్గం శ్రీను బసాపురం గ్రామ కార్యదర్శి బద్దల నరసింహారావు మామిడాల యాలాద్రి , నరసింహారావు, పదిమల వెంకట నర్సయ్య ఆవుల మంగయ్య అమర్లపుడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .