ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం అభినందనీయం.  

కుల, మత పార్టీలకతీతంగా గ్రామస్తులు కలిసి ఉండాలి

ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం అభినందనీయం.  

హనుమకొండ ఏసిపి పింగిలిప్రశాంత్ రెడ్డి.

హాసన్ పర్తి, తెలంగాణ ముచ్చట్లు.

 హన్మకొండ జిల్లా హాసన్ పర్తి మండలం ముచ్చర్ల గ్రామంలో  గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కాజీపేట ఏసిపి పింగిళి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాన్ని వాడుకోవడం ద్వారా గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉంటుందని అన్నారు,  కుల, మత, రాజకీయ పార్టీలకతీతంగా గ్రామస్తులంతా కలిసిమెలిసి ఉండాలని, మద్యనిషేధం కోరుతూ గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా అరికట్టడంలో గ్రామ అభివృద్ధి కమిటీ, యువత చేసిన కృషి అభినందనీయమని, మిగతా గ్రామాలు కూడా ముచ్చర్ల గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు, ఈ విషయంలో గ్రామస్థులకు పోలీస్ శాఖ ప్రతినిత్యం అండగా ఉంటుందని తెలియజేశారు.గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగిన వెంటనే పోలీస్ వారికి సమాచారం అందిస్తే తక్షణమే దోషులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ముచ్చర్ల  గ్రామంలో శాంతి భద్రత పరిరక్షణ కోసం  నిర్విరామంగా కృషి చేస్తున్న గ్రామ పోలీస్ అధికారి నాగపూరి యాదగిరి గౌడ్ ను ఈ సందర్బంగా ఏసీపీ,గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో హాసన్ పర్తి సీఐ చేరలు,ఎస్సై రవికుమార్, సిద్దయ్య,కాంగ్రెస్ నాయకులు దేవరకొండ అనిల్ కుమార్,కూడా మాజీ చైర్మన్ సంఘంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్,బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్,పెద్ది ఇంద్రసేన రెడ్డి,మాడూరి మనోహర్,మండల రవీందర్,చల్ల వెంకటేశ్వర్ రెడ్డి,సురప్రతాప్,దామెరశ్యామ్,సారయ్యమాట్టడసాంబయ్య,ప్రతాప్,జితేందర్,సాంబరాజు,పులిగారి రాజేష్,సుర ప్రమోద్, రాము యాదవ్,కంచరకుంట్ల మల్లారెడ్డి, సుధాకర్ రెడ్డి,రావుల యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .