బిజెపి నేత తల్లోజు ఆచారిని మర్యాద పూర్వకంగా కలిసిన గంటే ఉపేందర్
జనగాం,తెలంగాణ ముచ్చట్లు:
జనగాం బిజెపి జిల్లా కార్యాలయంలో బిజెపి కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జి,జనగాం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇంచార్జి తల్లోజు ఆచారిని మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు తల్లోజు ఆచారి పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసించి, తదుపరి కార్యక్రమాలకు మద్దతు తెలియజేశారు. బిజెపి కార్యకర్తలు, నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం సజావుగా కొనసాగింది.
ఈ కార్యక్రమంలో జనగాం బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి శుభాష్, పెరుమాళ్ల వెంకటేశ్వర్లు, వరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ ఇనుగాలా యుగేందర్ రెడ్డి, ఘనపూర్ స్టేషన్ అసెంబ్లీ కన్వీనర్ ఐలోని అంజిరెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాల్నే శ్రీనివాస్ గౌడ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కత్తుల లక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి తోకల సంపత్ రెడ్డి, గాజుల సంపత్ తదితర నాయకులు పాల్గొన్నారు.


Comments