జిల్లాలోనే రికార్డు ధర పలికిన జగత్ పల్లి వినాయకుని లడ్డు

జిల్లాలోనే రికార్డు ధర పలికిన జగత్ పల్లి వినాయకుని లడ్డు

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జగత్ పల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ వినాయకుడి లడ్డు వనపర్తి జిల్లాలోనే రికార్డు ధర పలికింది. విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గ్రామ వినాయకుడి లడ్డు వేలంలో భవాని యూత్ సభ్యులు,గ్రామానికి చెందిన విఘ్నేశ్వర యూత్, మరియు కృష్ణాష్టమి ఉత్సవ సభ్యులు పొటా పోటీగా వేలంలో పాల్గొనగా చివరగా భవాని యూత్ సభ్యులు ముంత మల్లేష్, చెవ్వ సురేష్,శశిధర్ రెడ్డి, ప్రకాష్, శివ, రాజు, బాలరాజు,రూ. 2 లక్షల 70 వేలకు లడ్డూను దక్కించుకున్నారు.వనపర్తి జిల్లాలోనే ఈ ఏడాది వినాయకుని లడ్డు రికార్డు ధర ఇదేనని విఘ్నేశ్వర యూత్ సభ్యులు రాజు, వెంకటేష్, నరేష్ ,శివ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .