జై దుర్గా భవానీ యూత్ అసోసియేషన్ దేవి నవరాత్రి ఉత్సవాలు
చర్లపల్లి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గ చర్లపల్లి డివిజన్, కుషాయిగూడ పరిధిలోని ఎంఆర్ఆర్ కాలనీలో నిర్వహించిన జై దుర్గా భవానీ యూత్ అసోసియేషన్ దేవి నవరాత్రి ఉత్సవాలకు దసరా పండుగ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనం ఇచ్చిన దుర్గామాత . జై దుర్గా భవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిషి చేతుల మీదుగా లక్కీ డ్రా తీయడం జరిగింది. లక్కీ డ్రా లో మొదట విజేతగా క్యాసని లతా మాధురి ఎలక్ట్రానిక్ స్కూటర్ విజేతగా గెలుపొందారు. రెండో విజేతగా మనీష్ మొబైల్ ఫోన్ గెలుపొందారు. యూత్ ఆర్గనైజర్ శకత్ విజయ్ కుమార్ చేతుల మీదగా విజేతలకు బహుమతులు అందజేశారు. మాట్లాడుతూ అమ్మవారు అందరికీ సుఖ సంతోషాలతో ఆశీర్వాదం ఇవ్వాలని శ్రీ రాజరాజేశ్వరి దేవిని వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ ఆర్గనైజర్ శకత్ విజయ్ కుమార్ మరియు కమిటీ సభ్యులు రాజశేఖర్ రెడ్డి, ఎస్. రాహుల్, యశ్వంత్, నాగేందర్, ఎస్. అరుణ్, కిషోర్, బాల, కే. ప్రసాద్, లింగం నాయక్,సంజయ్, దినేష్. భవాని దీక్ష మాలదారులు, అధిక సంఖ్యలో ప్రత్యేక అతిధులు పాల్గొన్నారు.


Comments