వరద బాధితులకు చాపలు , బ్లాంకెట్స్ పంపిణీ చేసిన జమాఅతె ఇస్లామి హింద్

వరద బాధితులకు చాపలు , బ్లాంకెట్స్ పంపిణీ చేసిన జమాఅతె ఇస్లామి హింద్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరదలు వచ్చి సర్వం కోల్పోయి నిరాశరులైన దంసలాపురం కాలనీ వరద బాధితులకు జమాఅతె ఇస్లామి హింద్ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో వరద ముంపు బాధిత కుటుంబాలకు ఇండ్ల దగ్గరికి వెళ్లి చాపలు , బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. జమాఅతె ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా నిరాశరులైన వరద బాధితులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు జమాత్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యాక్రమములో వన్ టౌన్, టూ టౌన్, అధ్యక్షులు అబ్దుల్ మలిక్, అబ్రార్ అలీ సభ్యులు నిజాముద్దీన్, గౌస్, యసుఫ్ షరీఫ్, ఇంద్ర నగర్ మహిళా అధ్యక్షురాలు హుస్సేన్ బి, జహీరా, ఆరిఫా ఎంపీజే జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .