వివాహ వేడుకల్లో పాల్గొన్న జంగా రాఘవ రెడ్డి
Views: 28
On
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి శనివారం వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలోని గ్రాండ్ సిటీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోతి స్వరూప బిక్షపతి గౌడ్ కుమార్తె వివాహానికి హాజరైన ఆయన, వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు.
అనంతరం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని సత్య సాయి కన్వెన్షన్ హాల్లో తాటికొండకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాపోలు అనిత, మల్లారెడ్డి కుమారుడు శివ చరణ్ రెడ్డి వివాహ వేడుకలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments