నూతన టీఆర్ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన ఝాన్సిరెడ్డి
దేవురుప్పుల,తెలంగాణ ముచ్చట్లు:
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రామచంద్రపురం క్రాస్‌రోడ్ సమీపంలోని కొలుకొండ గ్రామంలో టీఆర్ సంస్థకు చెందిన నూతన ఫిల్లింగ్ స్టేషన్‌ను టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సిరెడ్డి ప్రారంభించారు.ఈ ఫిల్లింగ్ స్టేషన్‌ను పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ రంగంలో ప్రముఖులైన మారేటి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఝాన్సిరెడ్డి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి ఇంధన సేవల విస్తరణ చాలా అవసరమని పేర్కొన్నారు. నాణ్యమైన ఇంధన సౌకర్యాలు అందుబాటులోకి రావడం, గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడడం శుభ సంకేతమని అభిప్రాయపడ్డారు. ఇటువంటి పరిశ్రమల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల మరియు గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, యువజన నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ఝాన్సిరెడ్డిని ఫిల్లింగ్ స్టేషన్ యజమానులు సన్మానించారు.


Comments