పాఠశాలను సందర్శించిన జే ఐ హెచ్ నాయకులు
Views: 5
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
జమాతే ఇస్లామీ హింద్ ( జేఐహెచ్ ) నాయకులు గురువారం స్థానిక జలగం నగర్ లోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ( బాలురు ) సందర్శించారు. జే ఐ హెచ్ జిల్లా అధ్యక్షుడు జైనుల్ పాషా , ఉపాధ్యక్షుడు అబ్దుల్ సమీ , ఖిలా అధ్యక్షుడు అబ్దుల్ మలిక్ లు పాఠశాలను సందర్శించి , పరిసరాలను పరిశీలించారు.
అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ ను కలుసుకొని విద్యార్థులకు అందజేస్తున్న భోజనం మంచినీరు విద్యార్థుల చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి చదువులు ఎలా కొనసాగుతున్నాయి అనే అంశాన్ని ప్రస్తావిస్తూ మైనార్టీ విద్యార్థుల అభ్యున్నతికి తమ వంతు సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులను కూడా కలుసుకొని ఈ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా అవసరమైతే తమను సంప్రదించాలని సూచించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments