ప్రెస్ క్లబ్ లో యోగిరెడ్డికి జర్నలిస్టుల కన్నీటి నివాళి

భారీగా తరలివచ్చిన గ్రేటర్ వరంగల్ జర్నలిస్టులు

ప్రెస్ క్లబ్ లో యోగిరెడ్డికి జర్నలిస్టుల కన్నీటి నివాళి

హనుమకొండ : కూతురుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన యువ జర్నలిస్టు, తొలి వెలుగు స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేసిన యోగి రెడ్డికి గ్రేటర్ వరంగల్ పరిధిలోని జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు. యోగి రెడ్డి శుక్రవారం సాయంత్రం హనుమకొండ బాల సముద్రంలోని ఏకశిలా పార్కు ఎదురుగా గల తన కార్యాలయంలో కూతురుతో సహా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా వారి మృతదేహాలకు శనివారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం యోగి రెడ్డి, ఆయన కూతురు ఆధ్య (10) మృత దేహాలను హనుమకొండలోని ప్రెస్ క్లబ్ కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంజీఎం నుండి ప్రెస్ క్లబ్ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి జర్నలిస్టు యోగి రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ క్లబ్, జర్నలిస్టు సంఘాల నాయకులు యోగి రెడ్డి, ఆద్య మృతదేహాలపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి అకాల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వారి మృతదేహాలను ప్రత్యేక వాహనం ద్వారా అంత్యక్రియల కోసం జనగామకు తరలించారు. ప్రెస్ క్లబ్ లో యోగి రెడ్డి, ఆయన కూతురు ఆద్యకు నివాళులు అర్పించిన వారిలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, కోశాధికారి బోళ్ల అమర్, జర్నలిస్టు సంఘాల నాయకులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, గాడిపెల్లి మధు, బీఆర్ లెనిన్, గడ్డం కేశవమూర్తి, పిన్నా శివకుమార్, పివి.కొండల్, వల్లాల వెంకట రమణ, పెండెం వేణుమాధవ్, తుమ్మ శ్రీధర్ రెడ్డి, మస్కపురి సుధాకర్, పెద్దీష్, రంజిత్, అరుణ్, కేకే, పొగాకుల అశోక్, గుంటి విద్యాసాగర్, వేముల సదానందం, ప్రెస్ క్లబ్, యూనియన్ ల బాధ్యులు గోకారపు శ్యామ్, బొడిగె శ్రీను, వలిశెట్టి సుధాకర్, వరప్రసాద్, పొడిశెట్టి విష్ణు వర్దన్,వాజిద్, అల్లం రాజేశ్ వర్మ, సంపెట సుధాకర్,అంజి, సంజీవ్,వేణుగోపాల్, మంచాల రాజు, దిలీప్,అంతడుపుల శ్రీనివాస్, శోభన్ తో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్,బీజేపీ, కమ్యూనిస్టు పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .