25న జెవివి జిల్లా మహా సభ
Views: 6
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఈ నెల 25న ఆదివారం ఖమ్మం లోని కవితా మెమోరియల్ డిగ్రీ కాలేజీలో జెవివి జిల్లా మహాసభను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలవాల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్ష , కార్యదర్సులు తుమ్మల శివన్నారాయణ, కె.రామారావు పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం లోని జెవివి జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత మహా సభ నుండి నేటి వరకు కార్యక్రమాలను సమీక్షించుకుని భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశించుకొనున్నట్లు తెలిపారు. ఈ మహాసభకు జెవివి రాష్ట్ర అధ్యక్షులు కోయ వెంకటేశ్వరరావు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ మహా సభను జయప్రదం చేయాలని కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments