ముఖ్యమంత్రి కి  కృతజ్ఞతలు తెలిపిన కడియం

ముఖ్యమంత్రి కి  కృతజ్ఞతలు తెలిపిన కడియం

స్టేషన్ ఘనపూర్, తెలంగాణ ముచ్చట్లు

స్టేషన్ ఘనపూర్ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం రోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు  అసెంబ్లీ వేదికగా స్టేషన్ ఘనపూర్ గ్రామాన్ని మున్సిపాలిటీగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించడం పట్ల  హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహకారంతో స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి అత్యధిక నిధులు తీసుకువచ్చి స్టేషన్ ఘనపూర్ రూపు రేఖలు మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అడిగిన వెంటనే కాదనకుండా నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే కడియం శ్రీహరి  మరోసారి ధన్యవాదములు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .