కడియం చిత్రపటానికి జలాభిషేకం
శ్రీపతిపల్లి త్రాగునీటి సమస్య పరిష్కారం
Views: 74
On
-బోర్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
చిల్పూర్,తెలంగాణ ముచ్చట్లు:
శ్రీపతిపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా త్రాగునీటి సమస్య తీవ్రతరమైంది. ఈ పరిస్థితిని గ్రామ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే అధికారులను ఆదేశించి కొత్త బోర్ వేయించి సమస్య పరిష్కరించారు.
తాజాగా బోర్ నీరు అందుబాటులోకి రావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కృతజ్ఞతగా, కొత్త బోర్ నీళ్లతో ఆయన చిత్రపటానికి గ్రామస్థులు జలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొని ఎమ్మెల్యే దయాదృష్టిని కొనియాడారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments