డాక్టరేట్ సాధించిన కంచనపల్లి యువకుడు

డాక్టరేట్ సాధించిన కంచనపల్లి యువకుడు

స్టేషన్ ఘనపూర్ , తెలంగాణ ముచ్చట్లు:

“చదువు మాత్రమే నిజమైన సంపద” అని నమ్మిన కంచనపల్లి యువకుడు, అనేక కష్టాలను ఎదుర్కొని రసాయన శాస్త్రంలో పీహెచ్ డి పూర్తి చేసి డాక్టరేట్ పొందాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని మేవార్ విశ్వవిద్యాలయం చైర్ పర్సన్ చేతులమీదుగా ఈనెల 21న అతను డాక్టరేట్ పట్టా అందుకున్నాడు.

కంచనపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ లడే సోమాజీ, రఘునాథపల్లి మండలం, జనగామ జిల్లా నుంచే రావడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్న సోమాజీ, 5 కిలోమీటర్ల దూరం ఎరిగే కాలినడక ప్రయాణాన్ని అలవాటు చేసుకున్నాడు.పార్టీ-టైమ్ జాబ్స్ చేస్తూ, జనగామలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ కోర్సులో ప్రథమ స్థానాన్ని సాధించి, ఖైరతాబాద్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత వివాహం చేసుకుని కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ, ఎన్ఐటీ వరంగల్ నుంచి రసాయన శాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశాడు.

పని, చదువుకు సమయం కేటాయించి, రాజస్థాన్‌లోని మేవార్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డి పూర్తి చేసి, 21వ తేదీన డాక్టరేట్ పట్టాను అందుకున్న సోమాజీ, జివికె బయో, డాక్టర్ రెడ్డిస్ లేబరేటరీస్ వంటి ప్రఖ్యాత సంస్థల్లో పనిచేసి, ప్రేరణకు నిలిచాడు.తన నిబద్ధత, కృషి, లక్ష్యానికి ఉన్న పట్టుదల ఈ రోజుల్లో ఎంతోమందికి ఆదర్శంగా మారింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .