కేటీఆర్ ను కలిసిన కన్మనూర్  బీఆర్‌ఎస్ నాయకులు

కేటీఆర్ ను కలిసిన కన్మనూర్  బీఆర్‌ఎస్ నాయకులు

అడ్డాకల్,డిసెంబర్20(తెలంగాణ ముచ్చట్లు):

అడ్డకల్ మండలం కన్మనూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు శనివారం తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తాజా సర్పంచ్ భర్త లక్ష్మీ వెంకటస్వామి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రాజవర్ధన్ రెడ్డి, విద్యా సాగర్, వెంకటేష్ తదితరులు కేటీఆర్ ను కలిశారు. గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు 7 మంది వార్డ్ మెంబర్ల గెలుపుకు కృషి చేసిన గ్రామ నాయకులను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
అలాగే భవిష్యత్తులో తిరిగి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని, అందరూ ధైర్యంగా ఉండాలని సూచిస్తూ.. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .