బిజెపి జిల్లా కార్యదర్శిగా కావలి తిరుపతయ్య నియామకం
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
భారతీయ జనతా పార్టీ వనపర్తి జిల్లా కార్యదర్శిగా కావలి తిరుపతయ్య నియమితులయ్యారు. పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన కావలి తిరుపతయ్య గతంలో పెద్దమందడి మండల బిజెపి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తిస్తూ.. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో కావలి తిరుపతయ్య ను జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు నారాయణ వెల్లడించారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు నారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా.. కావలి తిరుపతయ్య మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం జిల్లా కార్యదర్శిగా నియమించడంతో మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. నా మీద నమ్మకం ఉంచి జిల్లా కార్యదర్శిగా నియమించిన జిల్లా అధ్యక్షులు నారాయణ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కావలి తిరుపతయ్య తెలిపారు.


Comments