టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ  సభ్యులకు నియామక పత్రాలు  అందజేసిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ బలోపేతానికి కృషి చేయాలని సూచన  

టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ  సభ్యులకు నియామక పత్రాలు  అందజేసిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాo రెడ్డి సిఫారసుతో టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) సభ్యులుగా ఎంపికైన  8 మంది.. ఉమ్మినేని కృష్ణ, షేక్ ఇమామ్ సాహెబ్, యాస వెంకటేశ్వరరావు, పిల్లెల రామ లక్ష్మయ్య, బోదాసు కనకరాజు,   అమరావాది సత్య నారాయణ రెడ్డి, బానోత్ రంజిత్ లకు నియామక పత్రాలను ఎంపీ అందజేశారు. నగరంలోని గట్టయ్య సెంటర్ లో గల క్యాంపు కార్యాలయంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ  సందర్భంగా సభ్యులందరికీ ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ రీజియన్ లో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధి ఉంటుందని అన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులందరూ.. గ్రామీణ స్థాయిలో బీఎస్ఎన్ఎల్ విస్తరణకు, సంస్థ బలోపేతానికి విశేష కృషి చేయాలని అన్నారు. కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ  స్టాండింగ్ కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నానని.. మన రీజియన్ పరిధిలో బీఎస్ఎన్ఎల్ సంస్థ విస్తరణకు  సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని..అభయామిచ్చారు. ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్  బొర్రా రాజశేఖర్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా రాంబాబు, కాంగ్రెస్ జిల్లా నాయకులు బెల్లం శ్రీను, కొప్పుల చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ గోసు మధు, నాయకులు దొడ్డా నగేష్, స్ఫూర్తి ఓం రాధాకృష్ణ, ఉత్తేజ్ నాయక్, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల బాధ్యులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .