ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్ తండ్రికి ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి ఘన నివాళి
స్వామి గురునాథం అంత్యక్రియల్లో పాల్గొన్న రామ సహాయం
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
నగరంలోని ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్ కుమార్ తండ్రి స్వామి గురునాథం మృతి చెందగా.. ద్వారకా నగర్ లోని వారి నివాసానికి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి వెళ్లి.. మృతదేహం వద్ద ఘన నివాళులర్పించారు. స్వామి రమేష్ ను పరామర్శించి.. వివరాలు తెలుసుకున్నారు. స్వామి గురునాథం సతీమణి ఏసు లక్ష్మి, కుమారులు స్వామి అచ్యుతరావు, వెంకట్రావ్, రవికుమార్ లను ఓదార్చారు. దశాబ్దాల కాలం నుంచి వీరి కుటుంబంతో స్నేహం ఉందని, మంచి వ్యక్తిని కోల్పోయామని ఈ సందర్భంగా ఎంపి రఘురాంరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
.jpeg)
మంత్రి తుమ్మలతో కలిసి ఎంపీ పరామర్శ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి.. స్వామి రమేష్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్వామి గురునాథం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో..కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, ప్రముఖ న్యాయవాది ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాయకులు నెల్లూరి భద్రయ్య, షేక్ ఖాజామీయా, తదితరులు పాల్గొన్నారు


Comments