ఎంపీ రఘురాం రెడ్డి ప్రత్యేక చొరవతో.. పార్లమెంట్ సందర్శించిన ఖమ్మం విద్యార్థులు

ఎంపీ రఘురాం రెడ్డి ప్రత్యేక చొరవతో.. పార్లమెంట్ సందర్శించిన ఖమ్మం విద్యార్థులు

 ఈ అవకాశం కల్పించినందుకు పార్లమెంట్ సభ్యులు  రామసహాయంకు కృతజ్ఞతలు తెలిపిన అభినవ్ స్కూల్ పిల్లలు, యాజమాన్యం

ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 24, తెలంగాణ ముచ్చట్లు;

పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సిఫారసు లేఖతో విజ్ఞాన యాత్రలో భాగంగా న్యూఢిల్లీలోని భారత పార్లమెంట్ భవన సముదాయం, పార్లమెంట్ మ్యూజియాన్ని ఖమ్మం నగరంలోని అభినవ్ స్కూల్ విద్యార్థులు బుధవారం సందర్శించారు. ఇటీవల ఈ పాఠశాల యాజమాన్యం ఎంపీకి విజ్ఞప్తి చేయడంతో.. వెంటనే స్పందించి ఢిల్లీలోని ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక చొరవతో అక్కడ సందర్శన ఏర్పాట్లు పర్యవేక్షించడమే గాక..స్వయంగా విద్యార్థులను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా..ఎంపీ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, దేశ అత్యున్నత చట్టసభను సందర్శించడం ద్వారా.. ప్రజాస్వామ్య గొప్పతనం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడాలనే ఆకాంక్ష బాల్యం నుంచే మనసులో బలపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ విశేషాలు తెలియజేసి.. విద్యార్థులను ప్రోత్సహించిన ఎంపీ రఘురాం రెడ్డికి అభినవ్ స్కూల్ ప్రిన్సిపాల్ పారుపల్లి అరుణ, కరస్పాండెంట్ రమణ, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .