కొలిపాక వెంకటస్వామికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి
-బీసీ బహుజన సంక్షేమ సంఘం విజ్ఞప్తి
ఖమ్మం,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీసీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాపగిరి విజయ్ కుమార్ మాట్లాడుతూ, వరంగల్-నల్లగొండ-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న డా. కొలిపాక వెంకటస్వామిని గెలిపించాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. ఆయన మూడో వర్గంలోని వాడై బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నారని, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవ కోసం ముందుకు వచ్చారని వివరించారు.
ప్రభుత్వ వైద్యుడిగా పనిచేసిన వెంకటస్వామి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ముఖ్యంగా నిరుపేదలకు ఉచిత వైద్యం అందించడంతో పాటు, వైద్య విద్యార్థులకు బోధన చేసిన అనుభవం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పింఛను విధానంపై అనేక పోరాటాల్లో భాగస్వామ్యం అయిన ఆయన, ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడతారని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆయనను గెలిపించడం సమాజానికి మేలుకలిగే అంశమని, అన్ని వర్గాల వారు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బర్కం రామ్ మోహన్ గంగపుత్ర, రాష్ట్ర కార్యదర్శి దొడ్డిపాటి శేఖర్ రజక, రాష్ట్ర నాయకులు ఎదులాపురం బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.


Comments