వెల్టూర్ లో ఘనంగా కృష్ణాష్టమి ఉట్ల పండగ
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఉట్ల కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం యాదవులు ఆధ్వర్యంలో చిన్నారులు, పెద్దలు, గ్రామస్తులు కలిసి ఉట్టి కి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉట్లు కొట్టారు. ఉట్ల పండుగ సందర్భంగా.. ఉట్లు కొట్టిన వారిలో ట్రాక్టర్ మల్లయ్య, మధుగం కృష్ణయ్య ఉన్నారు. ఉట్లు కొట్టిన వారికి బహుమతులను అందజేశారు. ఉట్ల పండగ వేడుకల్లో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని ఆసక్తికరంగా తిలకించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని ఉట్ల పండుగ ఉత్సవంలో గ్రామానికి చెందిన అన్నదాతలు బండారి నరసింహ, బత్తుల రాములు, బత్తుల నరసింహ, బత్తుల హనుమంతు, బత్తుల అంజి వారి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, చిన్నారులు మహిళలు పాల్గొన్నారు.


Comments