భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి
కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
భూభారతి దరఖాస్తుల నిక్షిప్త ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి, తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ స్పష్టం చేశారు. బుధవారం ఐనవోలు తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా భూభారతి దరఖాస్తుల ఆన్‌లైన్ పరిస్థితి, భూముల నమోదు ప్రక్రియను కలెక్టర్ సమీక్షించారు. తహసీల్దార్ విక్రమ్ కుమార్ నుంచి దరఖాస్తుల ప్రస్తుత స్థితిగతులు, పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, పత్రాలను పరిశీలించారు.
అనంతరం తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్, రెవెన్యూ అధికులతో సమావేశమైన కలెక్టర్, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రామాణికంగా పరిశీలించి, క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి, ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో రెవెన్యూ నిర్వాహకులు, అధికారులు పాల్గొన్నారు.


Comments