పిడమర్తి రవిని మర్యాద పూర్వకంగా కలిసిన దళిత సంఘాల నాయకులు
Views: 53
On
హైదరాబాద్:
తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన పిడమర్తి రవిని దళిత సంఘాల నాయకులు గురువారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్‌గా సేవలందించిన రవిని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ నేతృత్వంలో పలువురు నాయకులు కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పిడమర్తి రవి తెలంగాణ రాష్ట్రంలో దళితుల హక్కుల సాధన కోసం చేపట్టాల్సిన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నారు. దళితుల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని నాయకులు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఆయనను కలిసినవారిలో దంతూరి చంద్రశేఖర్, కిషన్, బాలునాయక్, రవిచందర్, సుమన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments