సమచార హక్కు చట్టాన్ని పరిరక్షించుకుందాం.

డిబిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్.

సమచార హక్కు చట్టాన్ని పరిరక్షించుకుందాం.

హసన్‌పర్తి,అక్టోబర్ 12(తెలంగాణ ముచ్చట్లు):

సమాచార హక్కు చట్టాన్ని పరిరక్షించుకొని,భారత రాజ్యాంగ హక్కులను కాపాడుకుందామని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేష్ కుమార్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ పిలుపునిచ్చారు.
ఆదివారం రోజు హసన్‌పర్తి మండలం కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద స.హ చట్టానికి నేటితో  ఇరవై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రమేష్ కుమార్, చుంచు రాజేందర్ మాట్లాడుతూ స.హ.చట్టం అవినితి పరుల గుండేల్లో మరఫిరంగని స.హ చట్టం అనే ఆయుధాన్ని సక్రమంగావినియోగించుకోని,ఆక్రమఅవినితినినిర్మూలించాలని అన్నారు.సమాచార హక్కు చట్టం, 2005, ఆర్ టి ఐ అనేది ప్రభుత్వ రంగ సంస్థల నుండి సమాచారం పొందడానికి పౌరులకు అధికారాన్నిచ్చే చట్టమే ఆర్ టి ఐ చట్టం.చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తవుతున్నందున  ఈ నెల 5 నుండి 12 వరకు జరుగుతున్న వారోత్సవాలలో భాగంగా ప్రజలు,ప్రజాస్వామిక వాదులు,విద్యార్థులు, మేదావులు స.హ చట్టాన్ని అద్యయనం చేయాలన్నారు.ప్రభుత్వ కార్యకలాపాలలో పారదర్శకత,జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తూ  అవినీతిని అరికట్టడానికి సమాచార హక్కు చట్టం సహాయపడుతుందన్నారు. ఈ చట్టం ప్రకారం, భారతీయ పౌరులు ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న సమాచారాన్ని,రికార్డులను కోరవచ్చని అన్నారు.
ఈ చట్టం వినియోగదారులకు సాధికారతను కల్పించి, ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేస్తుందన్నారు. 
 సమాచార హక్కు చట్టం (ఆర్ టి ఐ) ప్రకారం, ప్రతి భారత పౌరుడు ప్రభుత్వ సంస్థల నుండి సమాచారాన్ని పొందే హక్కును కలిగి ఉంటాడన్నారు.
 ఈ చట్టం ద్వారా ప్రభుత్వాల పనితీరులో బహిరంగత, జవాబుదారీతనం పెరుగుతూ సమాచారం సులభంగా అందుబాటులో ఉండటం వల్ల అవినీతిని అరికట్టడానికి ఈ చట్టం ఒక ముఖ్య సాధనమన్నారు.
 పౌరులు లిఖితపూర్వకంగా సమాచారాన్ని కోరుతూ అభ్యర్థన చేయాలన్నారు.
 సాధారణంగా సమాచారాన్ని 30 రోజులలోపు అందించాలి, కొన్ని అత్యవసర సందర్భాలలో 48 గంటలలోపు అందించాలన్నారు.
కేంద్రంలో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సిఐసి), రాష్ట్రాలలో రాష్ట్ర సమాచార కమిషన్లు ఈ చట్టాన్ని అమలు చేస్తాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల అనిత,జిల్లా కార్యదర్శి చుంచు నరేష్,జిల్లా ఉపాధ్యక్షురాలు బౌతు రాధ,హసన్‌పర్తి మండల కార్యదర్శి అడేపు రమ, పుల్ల రవి,ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాద్యాయ అవార్డు గ్రహిత కుమారస్వామి,గిద్దే స్వామి,రాజు,కిరణ్,మధు,లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .