స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల 

స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల 

హైదరాబాద్‌

తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టబడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈసారి ఎన్నికలు ఐదు దశల్లో నిర్వహించనున్నట్లు ప్రధానాధికారి రాణికుముదిని తెలిపారు.

అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. అక్టోబర్ 23న తొలి విడత, 27న రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగనున్నాయి. అక్టోబర్ 31న తొలి విడత, నవంబర్ 4న రెండో విడత, నవంబర్ 8న మూడో విడతగా పోలింగ్ నిర్వహించనున్నారు.

గ్రామ పంచాయతీ ఓట్ల లెక్కింపు అదే రోజు జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 11న నిర్వహించనున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .