మద్దిగట్ల గ్రామం లో వాడవాడలా శ్రీకృష్ణని ఊరేగింపు
వనపర్తి జిల్లా ప్రతిని తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మదిగట్ల గ్రామంలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రబోధ సేవాసమితి ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకృష్ణుని ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రబోధ సేవా సమితి ఇందు జ్ఞాన వేదిక సభ్యులు మాట్లాడుతూ.. నిత్య జీవము, సత్యమార్గము, మోక్ష ద్వారము అన్ని కృష్ణుడే అని భగవద్గీత సారాంశమైన బ్రహ్మ కర్త, భక్తి యోగ సమాచారం తీసుకుని నిజమైన మార్గమును ఆచరించాలని తెలియజెప్పడం కోసమే కృష్ణుడి ఊరేగింపు కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. పెద్దమందడి మండలంలోని గట్ల ఖానాపూర్, వెల్టూర్, మదిగట్ల గ్రామాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కృష్ణుని ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక మద్దిగట్ల కమిటీ అధ్యక్షుడు సభ్యులు రాఘవేంద్రాచారి రవి కుమార్ మనోహర్ రమేష్ సుదర్శన్ యాది శంకర్ మంజుల సబిత శిరీష మాజీ ఎంపీపీ డాక్టర్ రఘు నాగన్న బుచ్చిలింగం సుదర్శన్ కుమ్మరి బాలయ్య పెద్దమందడి ఏఎస్ఐ హరిచంద్ర గౌడ్ & గ్రామ యాదవులు తిరుపతయ్య నాగేష్ నాగన్న కృష్ణయ్య రాము సర్పంచ్ బసవ రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments