మందు బాబులకు నిలయంగా మద్దిగట్ల ప్రాథమిక పాఠశాల
పాఠశాలకు గేటు లేకపోవడంతో లోపలికి ప్రవేశిస్తున్న మద్యం ప్రియులు
ఫెండింగ్ బిల్లులు రాక చేతులెత్తేసినసిన కాంట్రాక్టర్లు
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
చదువుల తల్లి సరస్వతి కొలువుండే పాఠశాలల్లో మద్యం ప్రియులకు అడ్డాగా మారింది.పెద్దమందడి మండలంలోని మద్దిగట్ల ప్రాథమిక పాఠశాలలో మంగళవారం రాత్రి ఆకాతాయిలు మద్యం సేవించి ఖాళీ విస్తరాకులు, మద్యం కింగ్ ఫిషర్ బీర్ల బుధవారం ఉదయం దర్శనం ఇచ్చాయి.గతంలో ఎనర్జీఎస్ ద్వారా పాఠశాల ప్రహరీ నిర్మాణం, అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా పాఠశాల పై కప్పు,బాత్రూమ్ నిర్మాణం కోసం పనులు మంజూరు అయినప్పటికీ వారు కాంట్రాక్టురులు నిధులు మంజూరు కాకపోవడంతో వారు చేసేది లేక పనులు పనులు సగానికి చేసి అర్ధంతరంగా నిలిపివేశారు.కనీసం పాఠశాలలో విద్యార్థినిలకు బాత్ రూం లేకపోవడంతో చేసేది లేక ఉపాధ్యాయులు అడ్డంగా చీరలు కట్టి మూత్రశాలగా నెట్టుకొస్తున్నారు. పాఠశాలకు ప్రహరీ గేటు లేకపోవడంతో రాత్రి వేళ మద్యం ప్రియులు లోపలికి ప్రవేశిస్తున్న మద్యం సేవించి విచ్చల విడిగా మద్యం సీసాలు,విస్తరాకులు ఉదయం దర్శనమిస్తున్నాయి.వీటిని చూసిన ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలనా...? పర్మిట్ రూమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివరాజును వివరణ కోరగా పాఠశాల ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని అన్నారు.వీటిని జాగ్రత్తగా చూసుకునేది గ్రామస్తులదే అన్నారు.వీటిని అరికట్టాలంటే అతి త్వరగా పాఠశాల ప్రహరీ గేటు ఏర్పాటు చేయాలని అన్నారు.


Comments