గంగారం చీకటిని పారద్రోలి వెలుగులు నింపిన మధుబాబు!
సొంత ఖర్చుతో 450 వీధి దీపాలు ఏర్పాటు.
సత్తుపల్లి, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలం, గంగారం గ్రామం అభివృద్ధి దిశగా మరో ముందడుగు వేసింది. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుండే మాజీ వైస్‌ఎంపీపీ దాసరి వెంకటరామిరెడ్డి (చిట్టినాయన) తనయుడు దాసరి మధుమోహన్ రెడ్డి (మధుబాబు) సొంత ఖర్చుతో గ్రామమంతా 450 వీధి దీపాలను ఏర్పాటు చేసి విశేష ప్రశంసలు అందుకున్నారు.
గట్టు బజార్, చాకలి బజార్, చిన్న సెంటర్, తూర్పు బజారు, పాత హరిజనవాడ, యాదవ బజార్, నాచారం రోడ్, జలగం నగర్ 1, జలగం నగర్ 2, గురుభట్లగూడెం రోడ్, మసీదు రోడ్, ప్రకాష్ నగర్ కాలనీ వంటి ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి ఒక్కో స్తంభానికి లైట్లు అమర్చించారు.
వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో యూత్ సభ్యులతో సర్వే చేయించాను. 450 లైట్లు అవసరమని తేలడంతో సొంత డబ్బుతోనే ఏర్పాటు చేశాను. గంగారం అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ప్రజల పక్కనే ఉంటాను అని మధుబాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువత, ప్రజలు పాల్గొన్నారు.


Comments