వెల్టూర్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
పెద్దమందడి,అక్టోబర్7(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రామాయణ రచయితగా ప్రసిద్ధి చెందిన ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని గ్రామ ప్రజలు ఆత్మీయంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా వాల్మీకి సంఘం అధ్యక్షులు మల్లక్ సురేష్ కుమార్ మాట్లాడుతూ, వాల్మీకి మహర్షి చూపిన ధార్మిక మార్గం అందరికీ ఆదర్శమని, యువత ఆయన బోధలను అనుసరించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మల్లక్ సురేష్ కుమార్ (వెల్టూర్ బి.ఆర్.ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, వాల్మీకి సంఘం అధ్యక్షులు), శాఖ వెంకటయ్య (మాజీ ఉప మండల పరిషత్ అధ్యక్షుడు), మల్లక్ కృష్ణయ్య (వెల్టూరు సింగిల్ విండో సంస్థ నిర్వాహకుడు), బోయ శ్రీను, మల్లక్ పెద్ద భీమన్న, కావాలి నాగన్న, జింకల కుర్మయ్య, శాఖ కృష్ణయ్య, భసరత, మన్నే ఓ.కొండ, కావాలి అంజి, ముమ్మాల్లా వెంకటయ్య, గురిసే కృష్ణ, కావాలి రాము, కావాలి రామస్వామి, జింకల దశరథ, జల్లి చిన్న కాశాన్న, పెద్ద కాశాన్న తదితరులు పాల్గొన్నారు.


Comments