యుజిడి పనులను పరిశీలించిన మహేష్ గౌడ్

యుజిడి పనులను పరిశీలించిన మహేష్ గౌడ్

చర్లపల్లి, నవంబర్ (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధి లోని శ్రీ సాయి గణేష్ నగర్‌లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సూచనల మేరకు 19 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన యుజిడి అభివృద్ధి పనులను డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు నేమూరీ మహేష్ గౌడ్ సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ, “ఇచ్చిన హామీ ప్రకారం చర్లపల్లి డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్ని విధాలా కృషి చేస్తున్నారు. డివిజన్‌లో పెండింగ్ ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, బిఆర్ఎస్ నాయకులు డప్పు గిరిబాబు, కనకరాజ్ గౌడ్, నర్సింహ, అనందరాజ్, రెడ్డి నాయక్, బాలరాజు, అనిల్, శ్రీశైలం, శ్రీనివాస్ నాయక్, సాగర్ గౌడ్, రాము, వెంకటేష్,సాయిబాబా,
 శేఖర్, రఘు, పాషా, రహీమ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .