ఓట్ల చోరీపై సంతకాల సేకరణ ముమ్మరం చేయండి
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్
–కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం.jpeg)
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 7, తెలంగాణ ముచ్చట్లు:
ఓట్ల దొంగలు గద్దె దిగండి అనే ఉద్యమం పిలుపు లో భాగంగా ఓట్ల చోరీపై సంతకాల సేకరణకు కాంగ్రెస్ నాయకులు నడుం బిగించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో మండల, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచన మేరకు ఓట్ల చోరీపై సంతకాల సేకరణ చేపట్టాలని కోరారు. బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కుపై ప్రజలకు వివరిస్తూ సంతకాల సేకరణ చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు కుట్ర పన్నడమే బిజెపి చేసే అతిపెద్ద పని అని ఆరోపించారు. ఎన్నికలను ప్రభావితం చేయడానికి బీహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ చేపట్టారని అన్నారు. ఏడాది కిందట చేపట్టాల్సిన ఈ సవరణ ప్రక్రియ ను ప్రతిపక్షాల ఓట్లను తొలగించాలని ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు చేపట్టారని విమర్శించారు ఎన్నికల కమిషన్ తనకున్న రాజ్యాంగ ప్రతిపత్తిని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి బిజెపి అక్రమాలను ఎండగట్టి ప్రజాభిప్రాయ సేకరణకు సంతకాలు తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో ఖమ్మం ప్రత్యేకత ను మరోసారి నిరూపించాలని అన్నారు. అంసెబ్లీ ఎన్నికల్లో పది కి పది సీట్లు ఎలా అయితే సాధించామో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్ని పంచాయతీలను కాంగ్రెస్ కే దక్కేలా పని చేయాలని బ్లాక్, మండల, పట్టణ అధ్యక్షులకు దిశా నిర్దేశం చేసినారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు టి పి సి సి ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ, నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహ్మద్ జావేద్, జిల్లా ఓ బి సి సెల్ అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు యర్రం బాలగంగాధర్ తిలక్, బోజెడ్ల సతీష్, దగ్గుల రఘుపతి రెడ్డి, చావ వేణు, కందిమల్ల వీరబాబు, వేముల కృష్ణప్రసాద్, మండల కాంగ్రెస్ అద్యక్షులు వడ్డే నారాయణరావు, కళ్ళెం వెంకటరెడ్డి, భూక్యా బాలాజి నాయక్, సూరంశెట్టి కిషోర్, కొమ్మినేని రమెష్ బాబు, గాలి దుర్గారావు, వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, శీలం వెంకటనర్సిరెడ్డి, స్వర్ణ నరేంద్ర, తలారి చంద్రప్రకాష్, కాపా సుధాకర్, కాసర చంద్రశేఖర్ రెడ్డి, మిరియాల రమణ గుప్త, ఎదునూరి సీతారాములు తదితర నాయకులు పాల్గొన్నారు.


Comments