మందకృష్ణ మాదిగను కలిసిన  మాల దాసరి సంక్షేమ సంఘం నాయకులు 

మందకృష్ణ మాదిగను కలిసిన  మాల దాసరి సంక్షేమ సంఘం నాయకులు 

-మాల దాసరిలను గ్రూప్ 1 లో చేర్చేందుకు కృషి చేయాలనీ వినతి 

-మాల దాసరిల వర్గీకరణపై చర్చ

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
మాల దాసరి (హరిదాసుల)వర్గీకరణపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకునేలా కృషి చేయాలనీ తెలంగాణ రాష్ట్ర మాల దాసరి సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు శనివారం మందకృష్ణ మాదిగను కలిసి విన్నవించారు. మాల దాసరి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను, రిజర్వేషన్ మార్పుల వల్ల వారి హక్కులు కష్టతరమవుతున్నాయని వారికీ సంఘ నాయకులు వివరించారు.

ఈ సందర్భంగా మాల దాసరి వర్గీకరణపై స్పష్టత ఇచ్చి, హరిదాసులను గ్రూప్-1లో చేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ చర్చలో తెలంగాణ రాష్ట్ర మాల దాసరి సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు పాల్గొని మంద కృష్ణతో చర్చించారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన సంఘ నాయకులకి  స్టేషన్‌ ఘన్‌పూర్ మాల దాసరి సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రేండ్ల సోమయ్య,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరుపల్లి ఐలయ్య,
ఉపాధ్యక్షులు ఘనసాల కోటయ్య,రేండ్ల యాదగిరి,
తెలకలపల్లి సమ్మయ్య,కోశాధికారి రేండ్ల శ్రీనివాస్, కొవ్వాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .