బేతుపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు.
సత్తుపల్లి, డిసెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
మండల పరిధిలోని బేతుపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. బేతుపల్లి గ్రామానికి చెందిన కర్లపూడి శ్రీనివాసరావు (45) (తండ్రి: అప్పారావు) బేతుపల్లి ప్రాథమిక పాఠశాల రోడ్డు వద్ద నిలుచున్న సమయంలో గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు గాయపడగా, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే సత్తుపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గొల్లమందల కృష్ణ, పైలెట్ రాధాకృష్ణ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సకాలంలో స్పందించి బాధితుడిని ఆసుపత్రికి చేర్చిన 108 సిబ్బందిని 108 సర్వీస్ జిల్లా మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, మూడు జిల్లాలను నిరంతరం పర్యవేక్షిస్తున్న ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజీరుద్దీన్‌తో పాటు బేతుపల్లి గ్రామస్తులు, ప్రయాణికులు అభినందించారు.


Comments