గ్రామీణ ప్రజలకు వైద్య సౌకర్యం 

వెల్టూర్ లో అక్షయ ప్రథమ చికిత్స కేంద్రాన్ని ప్రారంభించిన పెద్ద శ్రీనివాసరెడ్డి 

గ్రామీణ ప్రజలకు వైద్య సౌకర్యం 

ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి

పెద్దమందడి,అక్టోబర్2(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో చెన్నయ్య నూతనంగా ఏర్పాటు చేసిన అక్షయ ప్రథమ చికిత్స కేంద్రాన్ని గురువారం పెద్ద శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పెద్దమందడి మాజీ జడ్పిటిసి రఘుపతి రెడ్డి మాట్లాడుతూ ..గ్రామంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రథమ చికిత్స కేంద్రం ఎంత ఉపయోగపడుతుందని అన్నారు. వెల్టూర్ గ్రామంలో మెడికల్ షాప్ నిర్వాహకులు  సమీప గ్రామాల ప్రజలకు ప్రథమ చికిత్స కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం హర్షనీయమని పేర్కొన్నారు.అక్షయ ప్రాథమిక చికిత్స కేంద్రం ప్రజలకు ప్రాథమిక వైద్యసేవలు అందుబాటులో ఉంటూ... నైపుణ్యం, అర్హత కలిగిన ఎంబిబిఎస్ డాక్టర్లు అందుబాటులో ఉంటారని నిర్వాహకులు తెలిపారు.నిర్వాహకులు చెన్నయ్య ను జడ్పిటిసి రఘుపతి రెడ్డి, పెద్ద శ్రీనివాస్ రెడ్డి అభినందిస్తూ, సమాజానికి సేవలో అతని కృషి స్ఫూర్తిదాయకమని చెప్పారు. పెద్ద శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంబిబిఎస్ డాక్టర్లు అందుబాటులో ఉండటం ద్వారా చిన్న రోగాలు, అత్యవసర పరిస్థితులు సమయానికి తగిన విధంగా చికిత్స పొందగలుగుతారని తెలిపారు. వైద్య సేవలను అందించడం ద్వారా సమాజానికి ప్రగతి, ప్రజా సంక్షేమం దిశగా పెద్ద అడుగు వేయబడిందని వివరించారు.
అక్షయ ప్రథమ చికిత్స కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది, యువత,  పాల్గొన్నారు. ప్రజలకు ప్రాథమిక వైద్యసౌకర్యాలను చేరువ చేస్తూ, ఇది గ్రామీణ ఆరోగ్య పరిరక్షణకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.IMG-20251003-WA0008

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .