రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలి : మంత్రి పొంగులేటి

సీఎం కప్ కు ఎన్నికైన అనితను అభినందిస్తూ ప్రకటన

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న  కె. అనిత అనే విద్యార్థిని సీఎం కప్ పోటీల్లో భాగంగా ఇటీవల ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో  జరిగిన పుట్ బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికైన విషయం విధితమే.  ఈ సందర్భంగా అనితను అభినందిస్తూ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.  తన నియోజకవర్గానికి చెందిన విద్యార్థిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అవ్వడం గర్వకారణమని తెలిపారు. హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి  పుట్ బాల్ పోటీల్లోనూ అనిత సత్తా చాటి పాలేరు నియోజకవర్గానికి, ఖమ్మం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని  ఆకాంక్షిస్తున్నట్లు  మంత్రి  పొంగులేటి పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .