ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాం రెడ్డి సుడిగాలి పర్యటన

ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాం రెడ్డి సుడిగాలి పర్యటన

ఖమ్మం బ్యూరో, నవంబర్ 26, తెలంగాణ ముచ్చట్లు;

తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం  ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డితో కలిసి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.  అభివృద్ధి పనుల శంకుస్థాపనలతో పాటు, పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.IMG-20251126-WA0089

- *కోటి రూపాయల అభివృద్ధికి అంకురార్పణ*

ఖమ్మం నగరంలోని 60వ డివిజన్ రామన్నపేటలో రూ. కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు.

- *వివాహ వేడుకలకు హాజరు*

మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాం రెడ్డి మధిర పట్టణంలో వేమి రెడ్డి శ్రీనివాస రెడ్డి కుమార్తె వివాహానికి, ఖమ్మం నగరంలోని పుట్టకోటలో ఇరకబోయిన ముక్కంటి కుమారుని వివాహానికి, అలాగే చర్చి కాంపౌండ్, శ్రీరామ్ హిల్స్ ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ రెడ్డిపల్లిలో పాపిట్ల శ్రీను కుమారుని, చెన్నబోయిన శ్రీను కుమార్తెల వివాహాలకు హాజరయ్యారు. కూసుమంచి మండలంలో కొత్తపల్లి మల్లయ్య, గోపె పెద్ద వెంకన్న కుమారుల, రాము కుమార్తె వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

- *పలు కుటుంబాలకు సానుభూతి*

మధిర మండలం దిడుగుపాడు గ్రామంలో ఇటీవల మరణించిన యన్నం కోటేశ్వరరావు తండ్రి కుటుంబాన్ని, వైరా పట్టణ కేంద్రంలో చనిపోయిన చింతనిప్పు సుధాకర్ కుటుంబాన్ని, అలాగే పోలా శ్రీను అమ్మ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

- *డీసీసీ అధ్యక్షురాలికి అభినందన*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన తోట దేవి ప్రసన్న కూసుమంచిలో మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆమెను అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .