భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విస్తృత పర్యటన
రెండు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన మంత్రి
ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు:
జిల్లా పర్యటన సందర్భంగా సుజాతనగర్ మండలంలోని వేపలగడ్డ గ్రామం నుండి బృందావనం వరకు ఆర్&బి నిధులతో 2 కోట్ల వ్యయంతో మూడు కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..... ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లో ముందు ఉంది అని అన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి లో వెనుకబడి ఉందని అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామని అన్నారు.
కొత్తగూడెం శ్రీ రామచంద్ర కళాశాలలో సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ...
ప్రతి సంవత్సరం జనవరి మూడో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం గా ప్రకటించడం జరిగిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలల పధకం లో భాగంగా 657 కోట్ల రూపాయలు ఖర్చుతో అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించామన్నారు.
గత ప్రభుత్వం హాస్టల్ పిల్లలకు ఇవ్వని మౌలిక వసతులు మా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్స్ లో 200 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచడం జరిగిందని తెలిపారు. జిల్లా లో రామవరం ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కోసం కృషి చేస్తామని, అందుకోసం కొత్తగూడెం రుద్రంపూర్ ప్రాంతంలోని సింగరేణి, అటవీ, ప్రవేట్ భూములను ఏర్పాటు చేసుకొని రాబోవు ఆరు నెలల్లో కొత్తగూడెంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సింగరేణి కొత్తగూడెం ప్రాంతంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు.
కొత్తగూడెంలో ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం కోసం కృషి చేస్తామన్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం సాధించుకొని ప్రతి ఆడబిడ్డకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.
గత ప్రభుత్వం ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్న పేద విద్యార్థులకు కనీసం భోజనం పెట్టలేని పరిస్థితి.. ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.
జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి కలెక్టర్ ప్రత్యేక చొరవ...
జిల్లాలో విస్తృతంగా పర్యాటక రంగం అభివృద్ధి చేయాలనే ప్రత్యేక ఆలోచనలతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చొరవతో ఈ ఏరు పండగను రూపొందించడం జరిగిందన్నారు. ఈ పండుగను జనవరి 9న వైకుంఠ ఏకాదశి శుభదినం సందర్భంగా ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం రోజున ఈ వేడుక ప్రారంభమవుతుందని తెలిపారు. ఏరు అనేది ఈ జిల్లాలో మాట్లాడే గిరిజన భాషలో "నీరు" అని అర్థం. ఈ పేరు గోదావరి నది , ఘాట్ల చుట్టూ నిర్వహించే వేడుకలను ప్రతిబింబించేందుకు ఎంపిక చేశారని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆలోచనలో భాగంగా, ఈ పండుగ భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఆలయం, గోదావరి నది, బోటింగ్, కనకగిరి శిఖరం, గిరిజన గ్రామ అనుభవం, కిన్నెరసాని డ్యామ్, జింకల పార్కు వంటి పర్యాటక ప్రదేశాలపై దృష్టిని సారించేందుకు ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు.
అనంతరం పాల్వంచ మండలం రెడ్డిగూడెం గ్రామంలో 1 కోటి 70లక్షల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జి కు మంత్రి శంకుస్థాపన చేశారు. పాల్వంచ బైపాస్ రోడ్డుకు కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి సీతారాంపట్నం నుండి పాండురంగాపురం గ్రామం వరకు 10 కోట్ల రూపాయల వ్యయం తో పాండురంగాపురం బ్రిడ్జి వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ,ఐటీడీఏ పీవో రాహుల్ , ఇతర శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


Comments